ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో,
టాటా పవర్ 2030 నాటికి దేశవ్యాప్తంగా 10,000కు పైగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నివాస ప్రాంతాల్లో 7.5 లక్షల చార్జర్లను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,700కు పైగా చార్జింగ్ పాయింట్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ, ఈవీల అమ్మకాలు అధికంగా ఉన్న మహారాష్ట్ర, దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. వాహనాల అమ్మకాలు, వినియోగదారుల డిమాండ్‌ను పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట చార్జింగ్ సౌకర్యాలను కల్పించనుంది.