విదేశీ ప్రయాణాలకు తప్పనిసరి అయిన పాస్‌పోర్టును అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం కేవలం మూడు రోజుల్లో తత్కాల్ ద్వారా జారీ చేస్తుంది. సాధారణంగా పాస్‌పోర్టుకు 30-45 రోజులు పడుతుంది. ఉద్యోగం, చదువు, వైద్యం వంటి అత్యవసర అవసరాలకు ఈ సదుపాయం ఉంది. పాస్‌పోర్టు సేవా పోర్టల్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకుని, దరఖాస్తు ఫారం నింపి, తత్కాల్ కేటగిరీ ఎంచుకుని, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, రుసుము చెల్లించి, సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. అక్కడ బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తయ్యాక మూడు రోజుల్లో పాస్‌పోర్టు ఇంటికి చేరుతుంది.