ఏపీలోని పంచాయతీల్లో పన్ను రాయితీ

8681చూసినవారు
ఏపీలోని పంచాయతీల్లో పన్ను రాయితీ
AP: రాష్ట్ర ప్రభుత్వం మునిసిపాలిటీల తరహాలోనే గ్రామ పంచాయతీల్లోనూ ఇంటి పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5% రాయితీని ప్రకటించింది. ఈ రాయితీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను మొత్తానికి వర్తిస్తుంది. మే నెల చివరిలోపు పన్ను చెల్లించిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. దీనివల్ల పంచాయతీలకు ముందుగానే ఆదాయం సమకూరి అత్యవసర పనులు చేపట్టే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్