దేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఆదాయపు పన్ను రాయితీలను 15 ఏళ్లకు పొడిగించాలని ప్రతిపాదించింది. విదేశీ కంపెనీలు భారతీయ కాంట్రాక్ట్ తయారీ సంస్థలకు పరికరాలు అందించి, భారత్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ చేపట్టే ఆదాయంపై 2040-41 ఆర్థిక సంవత్సరం వరకు పన్ను మినహాయింపు లభించనుంది.