AP: విశాఖపట్నంలో పార్కుల్లో నడిచేవారిపై యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారనే వార్తలపై జీవీఎంసీ కమిషనర్ శ్రీకేతన్ గార్జ్ స్పష్టత ఇచ్చారు. నగరంలోని పార్కుల్లో వాకర్ల నుంచి ఎలాంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదని, ఫ్లెక్సీల వ్యవహారంపై వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. దీంతో, ఉచితంగా నడక సాగించవచ్చని తెలుసుకున్న వాకర్లకు, స్థానికులకు ఊరట లభించింది. ఈ వివాదంపై ప్రతిప
క్ష వైసీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.