విశాఖలో టీసీఎస్‌ భారీ పెట్టుబడి.. డేటా సెంటర్‌ ఏర్పాటు

4888చూసినవారు
విశాఖలో టీసీఎస్‌ భారీ పెట్టుబడి.. డేటా సెంటర్‌ ఏర్పాటు
AP: విశాఖపట్నం ఏఐ నగరంగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో టీసీఎస్‌ చర్చలు జరుపుతుంది. నవంబర్‌ నెలలో టీసీఎస్‌ విశాఖలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించనుంది. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా రాబోయే రెండేళ్లలో సుమారు రూ.2,60 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖకు రానున్నాయి.