AP: మాజీ మంత్రి పేర్ని నాని సమక్షంలో తెలుగుదేశం,
జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, బందరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నట్లు చేరిన నాయకులు ప్రకటించారు. ఈ చేరికలు మచిలీపట్నంలో వైఎస్ఆర్సిపిని మరింత బలోపేతం చేస్తాయని పేర్ని నాని పేర్కొన్నారు.