AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన చేపట్టారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యామ్నాయ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో రాజకీయ వేడి రాజుకుంది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో కాకుండా ఇతర మండలంలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.