చంద్రబాబుకు సవాల్ గా టీడీపీ జిల్లా కమిటీల ఎంపిక..?

1014చూసినవారు
చంద్రబాబుకు సవాల్ గా టీడీపీ జిల్లా కమిటీల ఎంపిక..?
టీడీపీలో జిల్లా కమిటీల ఎంపిక అధినేత చంద్రబాబుకే సవాల్‌గా మారిందన్న చర్చ జరుగుతుంది. ఆరు నెలల క్రితమే పూర్తి కావాల్సిన ఈ ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కి రాలేదు. జిల్లా అధ్యక్ష పదవులతో పాటు కార్యవర్గంలో చోటు కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఏకగ్రీవంగా కమిటీలను ఎంపిక చేయడం కష్టతరంగా మారింది. అయితే పార్టీ జిల్లా కమిటీల ఎంపిక కోసం ఆగస్టు నుంచి తీవ్ర కసరత్తు చేస్తున్నా ఏకగ్రీవంగా జరగడం లేదని సమాచారం.