టీడీపీ ఫైర్ బ్రాండ్స్ సైలెంట్: అధిష్టానం చర్యలే కారణమా?

2272చూసినవారు
టీడీపీ ఫైర్ బ్రాండ్స్ సైలెంట్: అధిష్టానం చర్యలే కారణమా?
తెలుగుదేశం పార్టీలో కొద్ది రోజులుగా నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. గతంలో వివాదాలకు కేంద్ర బిందువులుగా ఉన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ రఘు రామరాజు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వంటి నాయకులు అనూహ్యంగా వివాదాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధిష్టానం తీసుకున్న కఠిన చర్యలు, క్రమశిక్షణ సంఘం సిఫార్సులు, చంద్రబాబు జోక్యం వంటి కారణాలతో వీరి తీరులో మార్పు వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్