AP: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో
టీడీపీ ఎదుర్కొంటున్న సవాళ్లపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. 2009 తర్వాత ఈ నియోజకవర్గంలో
టీడీపీ గెలవలేదని, దీనికి బలమైన ప్రత్యర్థి బాలనాగిరెడ్డి, అంతర్గత గ్రూపు
రాజకీయాలు కారణమని సమీక్షలో తేలింది.
టీడీపీ జెండా ఎగరేయాలని,
వైసీపీ అరాచకాలను అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు స్థానిక నాయకులను ఆదేశించారు. పార్టీలోని గ్రూపు రాజకీయాలను వీడి, అందరూ కలిసి పనిచేయాలని, 2029 ఎన్నికల్లో విజయం సాధించాలని స్పష్టం చేశారు.