రైతును దారుణంగా కొట్టిన టీడీపీ నేత (వీడియో)

26506చూసినవారు
AP: కృష్ణాజిల్లాలోని నాగాయలంకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బీసీ రైతుపై టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. డ‌బ్బు తిరిగి ఇచ్చేసినా.. త‌న‌ను పంచాయతీకి పిలిచి దాడి చేశారని బాధితుడు వెంక‌టేష్‌ ఆరోపించాడు. త‌నను కులం పేరుతో దూషణలు చేస్తూ.. కాళ్ల‌తో త‌న్నార‌ని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేత దాడి చేయడంతో వెంకటేష్ గాయపడ్డారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్