రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత రాళ్ల‌ దాడి

30చూసినవారు
AP: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్న టీడీపీ నేత నరసింగరావుపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. నిర్మాణం తొలగించేందుకు జేసీబీతో వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై నరసింగరావు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో జేసీబీ కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని వీఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్