సీఎంఆర్ఎఫ్‌లో టీడీపీ నేత చేతివాటం!

0చూసినవారు
AP: సీఎంఆర్‌ఎఫ్‌లో టీడీపీ నేత చేతివాటం చూపించారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. రాజంపేటకు చెందిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ బాధితుడికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ రూ.14 లక్షల్లో రూ.8 లక్షలు తన అకౌంట్లో వేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రోడ్డు ప్రమాదంలో కన్ను పోగొట్టుకున్న తుంటి ఎల్లయ్యకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.14 లక్షలు మంజూరైంది. అయితే ఎల్లయ్య అకౌంట్‌లో డబ్బులు పడిన 20 నిమిషాల్లోనే వేణుగోపాల్ ఖాతాలోకి రూ.8 లక్షలు బదిలీ అయ్యాయి. ఆ విషయం తెలుసుకుని ఎల్లయ్య టీడీపీ నేతను నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్