AP: కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మలకాటిపల్లెకు చెందిన టీడీపీ నేత శివరామకృష్ణారెడ్డి సతీమణి రేణుక (33) మృతి చెందారు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి కారులో బయలుదేరగా.. మండపేట శివారులో ఎదురుగా వస్తున్న టిప్పరు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన రేణుకను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కారులో ఉన్న పలువురు గాయపడ్డారు.