AP: కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలం మాధవరంలో
వైసీపీ శ్రేణులపై
టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి వెళ్లి వస్తున్న
వైసీపీ వారి వాహనాలను
టీడీపీ శ్రేణులు అడ్డుకుని, కారు, బైక్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు
వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాధవరానికి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.