AP: విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద
టీడీపీ యువగళం నేతలు పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారని
వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘డీఎస్సీ అక్రమాలపై
వైసీపీ శాంతియుతంగా నిరసన చేస్తుంటే.. శాప్ డైరెక్టర్ అనుచరుడికి, మంత్రి నారా
లోకేశ్ యువగళం టీమ్‌కు శాప్ కార్యాలయం దగ్గర ఏం పని? నిన్న వచ్చిన వారిలో ఒక్కరిలో అయినా గురువుల లక్షణాలు ఉన్నాయా? చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఈ ప్రభుత్వం.. చెడులోనే కొట్టుకుపోతుంది’ అని అన్నారు.