AP: కడప జిల్లా, ప్రొద్దుటూరులో
టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి,
టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. షాపింగ్ మాల్ కు ఫైర్ సేఫ్టీ లేదని ప్రవీణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఫైర్ సేఫ్టీ తనిఖీలకు వచ్చిన జిల్లా ఫైర్ ఆఫీసర్ సమక్షంలోనే ఇరువర్గాలు ఘర్షణకు దిగి, రాళ్లతో దాడి చేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు.