టీడీపీ నేతల దందా.. వెలుగులోకి మరో కల్తీ మద్యం డంప్

68చూసినవారు
టీడీపీ నేతల దందా.. వెలుగులోకి మరో కల్తీ మద్యం డంప్
AP: అన్నమయ్య జిల్లాలో మరో కల్తీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది. ఉప్పరవాండ్లపల్లిలో భారీ నకిలీ మద్యం డంప్‌ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ములకల చెరువులో కోటి 75 లక్షల విలువ చేసే కల్తీ మద్యం సీజ్ చేశారు. కల్తీ మద్యం డంప్ స్వాధీనం చేసుకుని 10 మందిని అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం దందా అంతా టీడీపీ నేతల కనుసన్నలోనే జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్