టీడీపీ మహానాడు ప్రారంభం

706చూసినవారు
టీడీపీ మహానాడు ప్రారంభం
AP: టీడీపీ మహానాడు మంగళగిరిలో ప్రారంభమైంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉపన్యాసంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. రెండు రోజులపాటు హైబ్రిడ్ విధానంలో జరిగే ఈ మహానాడులో, రాష్ట్రవ్యాప్తంగా 1848 క్లస్టర్లలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కార్యకర్తలు కేంద్ర నాయకత్వంతో నేరుగా సంభాషించనున్నారు. మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.

ట్యాగ్స్ :