వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0చూసినవారు
AP: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా నదిలో అట్టహాసంగా బోటు ర్యాలీ నిర్వహించారు. ఉండవల్లి పాత ఇసుక రేవు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, 10 భారీ ఇసుక బొట్లు, 20 మర బోట్లతో ప్రాకశం బ్యారేజ్ వరకు సాగింది. బోట్లపై టీడీపీ జెండాలు రెపరెపలాడగా, నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు 'జై తెలుగుదేశం' అంటూ నినదించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ ర్యాలీ కరకట్ట ప్రాంతంలో ప్రత్యేక ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్