టీడీపీ కొత్త వ్యూహం.. మహిళలతో వైసీపీకి చెక్?

10095చూసినవారు
టీడీపీ కొత్త వ్యూహం.. మహిళలతో వైసీపీకి చెక్?
AP: రాబోయే ఎన్నికల కోసం టీడీపీ కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు మహిళలతో సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సంఘాలు రాజకీయాలకు అతీతంగా, అన్ని వయసుల మహిళలతో గ్రామాలు, మండలాలు, నగరాల్లో ఏర్పడతాయి. వీరు స్థానిక రాజకీయ నాయకుల పనితీరు, వ్యవహారాలు, మనస్తత్వాన్ని అధ్యయనం చేసి, తమ పరిచయస్తులకు చేరవేస్తారు. మౌఖిక ప్రచారం ద్వారా వైసీపీ నాయకుల పనితీరుపై దృష్టి సారించి, ఎన్నికల సమయానికి వారిపై బలమైన అభిప్రాయాన్ని ఏర్పరచడం చంద్రబాబు లక్ష్యం.

సంబంధిత పోస్ట్