మ‌ద్యం మ‌త్తులో కారుతో టీడీపీ కార్య‌క‌ర్త హ‌ల్‌చ‌ల్‌

12చూసినవారు
TG: తిరుపతి బైరాగిపట్టెడ కేశవయన కుంట వద్ద, మద్యం మత్తులో ఉన్న టీడీపీ కార్యకర్త యశ్వంత్ చౌదరి నడిరోడ్డుపై కారు నిలిపి మద్యం సేవించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పేషెంట్‌ను తరలిస్తున్న కారుకు దారి ఇవ్వాలని అడిగిన వారిపై కత్తి చూపించి దాడికి యత్నించాడు. స్థానికులు ఈ ఘటనను సెల్ ఫోన్‌లో రికార్డ్ చేయడంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ట్యాగ్స్ :