టీడీపీకి కార్యకర్తలే అధినేతలు: మంత్రి లోకేశ్

41చూసినవారు
టీడీపీకి కార్యకర్తలే అధినేతలు: మంత్రి లోకేశ్
టీడీపీకి కార్యకర్తలే అధినేతలని, వారికి న్యాయం చేయడంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పార్టీ విధానాలను అధినాయకత్వం నిర్ణయిస్తుందని, అందరూ వాటిని పాటించాలని, అధికారంలో ఉన్నా నిర్లక్ష్యం పనికిరాదని ఆయన అన్నారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని, పార్టీ కోసం పనిచేసిన అర్హులకు, కార్యకర్తలకు ఈ పదవులు దక్కుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :