అనంతపురం పట్టణంలోని పాపంపేట వద్ద 20 రూపాయల చిల్లర విషయంలో తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. కూరగాయల వ్యాపారి శేఖర్‌తో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు బిల్లు విషయంలో గొడవపడ్డారు. గొడవను ఆపడానికి వెళ్లిన టీ స్టాల్ యజమాని చంద్రపై యువకులు దాడి చేయడంతో, ఛాతిపై బలమైన దెబ్బ తగిలి చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం 20 రూపాయల కోసం జరిగిన ఈ ఘాతుకంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.