3వ క్లాస్ బాలికను దారుణంగా కొట్టిన టీచర్ (వీడియో)

7666చూసినవారు
యూపీలో ఈట జిల్లా జైత్రాలోని ఎస్పీఎస్ పబ్లిక్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు దారుణంగా దాడి చేశాడు. బాలిక జుట్టు పీకి తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాలిక కుటుంబ సభ్యుల ముందు ఏడ్చి జరిగిన దారుణాన్ని వివరించింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్