AP: అనంతపురం జిల్లా పుట్లూరులో విషాదం చోటు చేసుకుంది. ఆదర్శ పాఠశాలలో గురువారం ఉదయం 8:30 గంటలకు ఆటోమోటివ్ ట్రేడ్ విభాగంలో పనిచేస్తున్న వృత్తి విద్యా ఉపాధ్యాయురాలు ఎ. ఐశ్వర్య కుప్పకూలి పడిపోయారు. తోటి ఉపాధ్యాయులు వెంటనే ఆమెను పుట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం 108లో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తీవ్ర గుండెపోటుతో మరణించారు.