పచ్చకామెర్లతో ఉపాధ్యాయురాలు మృతి

30చూసినవారు
పచ్చకామెర్లతో ఉపాధ్యాయురాలు మృతి
AP: అల్లూరి జిల్లా, పెద్దబయలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఒక పాఠశాలలో పనిచేస్తున్న భవాని అనే ఎమ్టీఎస్ (MTS) ఉపాధ్యాయురాలు పచ్చకామెర్లతో  మృతి చెందారు. ఆమె నాలుగు నెలల క్రితం అనకాపల్లి నుంచి పెద్దబయలుకు బదిలీ అయ్యారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భవాని బుధవారం మరణించారు. కాగా, ఇటీవల మన్యం జిల్లాలోపలువురు గిరిజన బాలికలకు పచ్చకామెర్లు వచ్చిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్