భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జింబాబ్వే పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా ఆతిథ్య జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు జులై 23, 25, 26 తేదీలలో హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్నాయి. అంతేకాకుండా, జనవరి 2027లో జింబాబ్వే జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనుంది.