TG: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో పని ఒత్తిడి తట్టుకోలేక సతీష్(31) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని అమలాపురంకు చెందిన సతీష్ గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం వివాహం చేసుకున్న సతీష్ సంక్రాంతికి సొంతూరికి వెళ్లిన భార్య కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఉదయం గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో తలుపులు బద్దలు కొట్టగా, ఫ్యాన్‌కు భార్య చున్నీతో ఉరేసుకుని ఉన్నాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, పని ఒత్తిడితోనే మృతి చెందినట్లు నిర్ధారించారు.