కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, టెక్నాలజీ పూర్తిస్థాయిలో సామాన్యుడికి ఉపయోగపడాలని అన్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, 21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీదేనని, దివ్యాంగులకు అండగా ఉండేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించారు.