యువ హీరో తేజ సజ్జ నటించిన 'జాంబీ రెడ్డి' చిత్రానికి సీక్వెల్‌గా 'జాంబీ రెడ్డి 2' తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ యువ నటి షనాయా కపూర్ కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, చిత్రబృందం షనాయా కపూర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.