ముగిసిన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం

3600చూసినవారు
ముగిసిన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం
కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి జరిగిన తొలి సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ తెలంగాణ నుంచి 12 అంశాలు చర్చించాలని ప్రతిపాదించామని, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని స్పష్టం చేశామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలపై పలు అంశాలు ఉన్నాయని, అందుకే సమావేశానికి వచ్చామని, ఏపీ తన అజెండాను చెప్పలేదని పేర్కొన్నారు. కాగా తదుపరి సమావేశం కేంద్ర జల సంఘం నిర్ణయిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్