తెలంగాణ CM ఏపీకి తొత్తు కావొచ్చు.. ప్రజలు కాదు: కవిత

15501చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి తొత్తుగా మారొచ్చేమో కానీ, తెలంగాణ ప్రజలకు, జర్నలిస్టులకు ఆ అవసరం పట్టలేదని TRS అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. పొలిటికల్ విమర్శలు చేసినందుకు తెలంగాణ జర్నలిస్ట్ KV రెడ్డిని AP పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆమె స్పందించారు. ఏపీ పోలీసులకు TG పోలీసులు సహకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అతడిని లాక్కెళ్తుంటే భార్య, పిల్లలు ఏడుస్తున్న వీడియో హృదయవిదారకంగా ఉందని అన్నారు. తెలంగాణావాదాన్ని వేర్పాటువాదమనే సినీనటుల విషయంలో పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్