దేశంలోనే అత్యధికంగా వ్యాట్​ విధిస్తున్న రాష్ట్రం తెలంగాణ: కిషన్ రెడ్డి

8311చూసినవారు
దేశంలోనే అత్యధికంగా వ్యాట్​ విధిస్తున్న రాష్ట్రం తెలంగాణ: కిషన్ రెడ్డి
TG: పశ్చిమాసియాలో​ యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్​పై ఎక్సైజ్​ డ్యూటీని తగ్గించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై భారం పడకుండా రాష్ట్రాలు కూడా వ్యాట్​ను తగ్గించుకోవాలని సూచించారు. పెట్రోల్, డీజిల్‌పై దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం వ్యాట్​ విధిస్తోందన్నారు. ఏపీలో 31 శాతం, MHలో 26 శాతం, KAలో 29 శాతంగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో మాత్రం 35.20 శాతం ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్