శ్రీశైల మల్లన్న సేవలో మంత్రి కొండా సురేఖ

7927చూసినవారు
శ్రీశైల మల్లన్న సేవలో మంత్రి కొండా సురేఖ
నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద మంత్రికి ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి కొండా సురేఖ, కుటుంబ సభ్యులు స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రి సురేఖను సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్