బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి

10881చూసినవారు
బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి
బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ తోట దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కోస్ట్ గార్డ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భారత్‌లోని కుటుంబసభ్యులకు సమాచారం అందించాయి. కాగా బహ్రెయిన్‌లోని మహమ్మద్‌ అహ్మద్‌ కో (MAC) సంస్థలో శ్రీనివాస్ 2019 నుంచి పని చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్