ఆసియా చాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్ కు రెండు స్వర్ణాలు

2644చూసినవారు
ఆసియా చాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్ కు రెండు స్వర్ణాలు
ఆసియా సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన షూటర్‌ ఇషా సింగ్‌ అద్భుత ప్రతిభ కనబరిచింది. న్యూఢిల్లీలో బుధవారం ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్‌లో 21 ఏళ్ల ఇషా మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో, టీమ్‌ విభాగంలో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది. వ్యక్తిగత ఫైనల్లో 239.8 పాయింట్లతో విజేతగా నిలిచిన ఇషా, టీమ్‌ విభాగంలో సురుచి సింగ్‌, మను భాకర్‌లతో కలిసి 1726 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో భారత్‌కు కాంస్యం, రజతం లభించాయి. జూనియర్‌ పురుషుల విభాగంలో గావిన్‌ ఆంటోనీ స్వర్ణం నెగ్గగా, టీమ్‌ విభాగంలోనూ భారత్‌కు పసిడి దక్కింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్