AP: బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తనకు సీఎం పదవి కొత్త కాదని, తెలుగు ప్రజలే తనకు రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. కష్టాలు ఎదురైనప్పుడు పారిపోకుండా పోరాడుతానని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని
మోదీ కలిసి పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.