ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలకు ప్రశంసలు.. బడ్జెట్‌లో భారీ ఆశలు

1670చూసినవారు
ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలకు ప్రశంసలు.. బడ్జెట్‌లో భారీ ఆశలు
కేంద్ర బడ్జెట్ కు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిని ప్రశంసించారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ టెన్ నగరాల్లో విజయవాడ, తిరుపతిలకు చోటు దక్కింది. హైదరాబాద్ ఎప్పుడూ టాప్ ఫైవ్ లోనే ఉంటుంది. ద్రవ్యోల్బణం తగ్గి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని సర్వే పేర్కొంది. అయితే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ఎంత వాటా దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. విభజన చట్టం హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, అమరావతి వంటి అంశాలపై ఏపీకి కేంద్రం నుంచి భారీ సాయం అవసరమని అంటున్నారు. ఏపీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, కేంద్ర బడ్జెట్ కేటాయింపులపైనే ఆ రాష్ట్రం ఆశలు పెట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్