దేవాలయ ఈవో దొంగతనం.. పట్టుకున్న భక్తులు

31చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ గుడి వద్ద దేవాలయ ఈవో మురళీకృష్ణ, అమ్మవారి ఆభరణాలను దొంగిలించే ప్రయత్నం చేయగా భక్తులు, స్థానికులు పట్టుకున్నారు. ఐదు కేజీల వెండి ఆభరణాలు, విలువైన చీరలు, ఇతర వస్తువులను ఆటోలో తరలిస్తుండగా వారిని అడ్డగించారు. ఆగ్రహించిన భక్తులు ఈవో, అతని కుటుంబ సభ్యులను ఆటోతో సహా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.