పంచాయతీరాజ్‌లో పదివేల మందికి పదోన్నతులు: డిప్యూటీ సీఎం పవన్‌

38చూసినవారు
పంచాయతీరాజ్‌లో పదివేల మందికి పదోన్నతులు: డిప్యూటీ సీఎం పవన్‌
పల్లెల కోసమే పంచాయతీరాజ్‌ శాఖను తీసుకున్నానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. మంగళగిరిలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు జరిగాయని, వాటిని నిర్మూలించాలని ఆదేశించారు. సీనియారిటీ, సిన్సియారిటీ, పనితీరు ఆధారంగా 10 వేల మందికి పదోన్నతులు కల్పించామని, రాష్ట్ర ఆదాయం పెంచడంపై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్