కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో కాకాణీ

47చూసినవారు
కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో కాకాణీ
నెల్లూరు జిల్లా రామాపురం మండలం కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఆధ్వర్యంలో జలాశయాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వైసీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో కాకాణితో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్