AP: గణేశ్ నిమజ్జనంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం నంద్యాల జిల్లా వెలుగోడులోని ఎస్సీ కాలనీలో వినాయకుడి ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపులో రెండు వర్షాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సౌండ్ సిస్టమ్ ఆపేయాలని ఓ వర్గం వారు పట్టుపట్టడంతో గొడవ మొదలైంది. దీంతో ఘటనా స్థలానికి కలెక్టర్, పోలీసులు చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.