ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఇజ్రాయిల్ దాడులపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం
Mar 27, 2026, 12:03 IST/

ఇజ్రాయిల్ దాడులపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం

Mar 27, 2026, 12:03 IST
టెహ్రాన్‌పై ఇజ్రాయిల్ భారీ దాడి చేయడంతో పాకిస్తాన్‌లో కలవరం మొదలైంది. పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి సమీపంలో ఈ దాడి జరిగింది. తమ రాయబార కార్యాలయానికి సమీపంలో దాడి జరగడంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. “దాడులు చేస్తే ఖతార్‌లా మేము మౌనంగా ఉండము” అని పాకిస్తాన్ ఇజ్రాయిల్‌ను గట్టిగా హెచ్చరించింది. పాకిస్తానీ దౌత్యవేత్తలు, వారి సిబ్బంది సురక్షితంగా ఉన్నారని సమాచారం. ఇరాన్ యుద్ధం ముగిసేలా అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.