ఉద్రిక్తత.. వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం (VIDEO)

53చూసినవారు
AP: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా రేపల్లె సెంటర్‌లో పీటా మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించి అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో రేపల్లె కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్