రంగా విగ్రహం ఏర్పాటుపై ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య తోపులాట

4313చూసినవారు
రంగా విగ్రహం ఏర్పాటుపై ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య తోపులాట
AP: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటుపై శనివారం కూడా ఉద్రిక్తత కొనసాగింది. విగ్రహం తొలగించిన ప్రాంతంలో రంగా కుమార్తె ఆశాకిరణ్‌ బైఠాయించడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ సీఐ సహా పలువురు కిందపడటంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొవ్వూరు ఆర్డీవో ఆనందరావు, డీఎస్పీ దేవకుమార్‌ ఆశాకిరణ్‌తో చర్చించారు. దిమ్మె తొలగించిన ప్రాంతానికి సమీపంలోని ఓ ప్రైవేటు స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడంతో వివాదం సద్దుమణిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్