ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్ర చేస్తున్నారని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రముప్పు ఉన్న ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. దాడుల కోసం విదేశీ ఆయుధాలను పెద్ద ఎత్తున సమకూర్చినట్టు సమాచారం అందిందన్నారు. ప్రధాన నగరాల్లోని ఓ ప్రముఖ అంతర్జాతీయ కాఫీ చైన్‌లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడుల ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.