చాలామంది గ్యాస్ సిలిండర్లకు ఎక్స్‌ఫైరీ డేట్ ఉంటుందని పొరపడుతుంటారు. అయితే, సిలిండర్‌పై ఉండేది టెస్ట్ డ్యూ డేట్ కోడ్ మాత్రమే. ఈ కోడ్ సిలిండర్ భద్రతను నిర్ధారించడానికి క్రమానుగతంగా తనిఖీ చేయాల్సిన తేదీని సూచిస్తుంది. ఆంగ్ల అక్షరం (A, B, C, D) సంవత్సరంలోని క్వార్టర్‌ను, పక్కన ఉన్న సంఖ్య సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, D-28 అంటే అక్టోబర్-డిసెంబర్ 2028 మధ్య భద్రతా తనిఖీ చేయాలి అని అర్థం. గడువు తీరిన కోడ్ ఉన్న సిలిండర్‌ను తీసుకోవడం సురక్షితం కాదు. డెలివరీ సమయంలో సీల్, లీకేజీ వాసనతో పాటు ఈ టెస్ట్ డ్యూ డేట్ కోడ్‌ను తప్పకుండా తనిఖీ చేయాలి.