AP: కూటమి ప్రభుత్వం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్-2025 (అక్టోబర్) అర్హత పరీక్షను తప్పనిసరి చేసింది. ఈ పరీక్షా విధానం, మార్కుల కేటాయింపు, నిబంధనలు ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. 2012లో టెట్ పాసై, డీఎస్సీ ద్వారా ఉద్యోగంలో చేరినవారు కూడా మళ్లీ పరీక్ష రాయాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో కామన్ పేపర్‌లో ఉత్తీర్ణులైనవారు కూడా ఇప్పుడు మళ్లీ అర్హత సాధించాల్సి రావడం విమర్శలకు దారితీస్తోంది.